Avatar Meher Baba's ONLINE BOOK STORE
Cart 0
Meher Prabhu  Charitam -Vol 16 (Telugu) మెహెర్ ప్రభుచరితము by  భావూ కల్చురి (PB)

Meher Book House

Meher Prabhu Charitam -Vol 16 (Telugu) మెహెర్ ప్రభుచరితము by భావూ కల్చురి (PB)

Rs. 200.00

Meher Prabhu Charitam - 16 is
Telugu translation of English Lord Meher edition from pages 4210 to 4445

ఈ సంపుటిలో 1962 జనవరి నుండి 1963 జూన్‌ వరకు (ఇంగ్లీషు గ్రంధం 4210 పేజి నుండి 4445 పేజీల వరకు) దైవీమానవుడైన అవతార్‌ మెహెర్‌బాబా జీవిత విశేషాలను ప్రస్తావించడం జరిగింది. ‘మెహెర్‌ ప్రభుచరితం’ బాబా సమక్షాన్ని పాఠకులకు అందించి, ఆనందపారవశ్యంలో ఓలలాడిచే అద్భుతమైన గ్రంధం. ఈ సంపుటిని సద్వినియోగ పరచుకొని బాబా సాన్నిధ్యాన్ని చదువరులు అనుభూతి చెందుతారని ఖచ్చితంగా చెప్పవచ్చును.

ఈ సంపుటిలోని విశేషాలు:
* 1962 వేసవిలో బాబా గురుప్రసాద్‌లో ఉండగా బాబా మండలిసభ్యుడైన విష్ణుమాష్టర్‌ గుండెపోటుతో మరణించడం, మరణించిన తరువాత కూడా బాబా వచ్చారనగానే కళ్ళు తెరచి చూసి తిరుగులేని విధేయత చూపిన సన్నివేశం
* బాబా స్పిరిట్యువల్‌ మదర్‌గా పిలువబడే గుల్మాయి 1962 ఆగష్టులో తనువుచాలించడం; ఆమె అంత్యక్రియలకు బాబా మెహెరాబాద్‌ వెళ్ళడం; బాబా భౌతకదేహంతో ఉండగా మెహెరాబాద్‌ వెళ్ళడం అదే చివరిసారి కావడం;
* ముఖ్యంగా నభూతో నభవిష్యత్‌గా సాగిన ప్రాక్పశ్చిమ సమ్మేళన విశేషాలు అతి మనోహరంగా వర్ణించబడ్డాయి. ఆ నాలుగు రోజుల సహవాస్‌ సమయంలో బాబా కురిపించిన ప్రేమ వర్షంలో ప్రేమికులంతా తడిసి ముద్దవ్వడం;
* సహవాసీయులను బాబా ఎంతో సన్నిహితులుగా ఆప్యాయంగా పలుకరించడం; పాశ్చాత్యులు బాబాను దర్శించినప్పుడు వారికి కలిగిన అనుభవాల గురించి చదువుతుంటే మేను పులకరింపు కలిగే విధంగా ఉన్నాయి
* సో.. కోడూరి కృష్ణారావు నిర్మించిన మెహెర్‌స్థాన్‌లో (కొవ్వూరు) బాబా నిలువెత్తు కాంస్య విగ్రహ ప్రటిష్ఠకు ముందు అక్కడే అందరికీ కనిపించేటట్లు ప్రదర్శించమని 8 సందేశాలను బాబా పంపించడం; వాటిని అందుకున్న పిదప బాబాకు ` సో.. రామలింగేశ్వరరావుకు మధ్య నడచిన ఉత్తరప్రత్యుత్తరాలు మనం చదివి తీరవలసిందే;
* తంతులు, కర్మకాండలతో కూడిన పూజావిధానంలోని డొల్లతనాన్ని వెల్లడిరచి, హృదయపూర్వకమైన ప్రార్ధన ఎంత అవసరమో బాబా ఆ లేఖలలో తెలియజేసిన విషయాలు మనందరికీ కనువిప్పుగా ఉంటాయి.
* బాబా గురుప్రసాద్‌లో ఉండగా మోహన్‌సైగల్‌, హబీబ్‌ కవ్వాల్‌, లతాలిమాయె, బేగమ్‌ అక్తర్‌ పాడిన గజల్స్‌ విని అనందించిన తీరు...
* ఒక సందర్భంలో బాబా ‘ఆ పాడేవాడు, పాట, సంగీత వాయిద్యాలు, వినే శ్రోతలు అన్నీ నేనే అనే నిరంతర అనుభవం నాది’ అని చెప్పడం; ఆంధ్రాకు చెందిన భాస్కరరాజు బృందం ముర్రకధలోని కొంత భాగాన్ని బాబాకు విపిపించడం, బాబా మెచ్చుకోవడం.


Share this Product


More from this collection