
Meher Book House
Meher Prabhu Charitam -Volume 14 (Telugu) ; మెహెర్ ప్రభుచరితము Vol 14 By భావూ కల్చురి (PB)
Meher Prabhu Charitam - 14 is Telugu Translation of English LORD MEHER edition from pages 3749 to 3976
- ఈ సంపుటిలో 1957 అక్టోబర్ నుండి 1958 మార్చి వరకు (ఇంగ్లీషు గ్రంథం 7వ వాల్యూం లోని పేజీ 3749 నుండి 3976 వరకు) దైవీ మానవుడైన అవతార్ మెహెర్‌బాబా జీవిత వృత్తాంతాన్ని ప్రస్తావించడం జరిగింది.
- తెలుగు మరియు గుజరాత్ సహవాసీయులకు అయిదు రోజులపాటు తన సాన్నిహిత్యాన్ని ప్రసాదించడం; బాబా అందరినీ తన ప్రేమ మహాసాగరంలో ఓలలాడిరచడం ఈ సంపుటిలో వర్ణించిన తీరు ఆ సహవాస్లో మనము కూడా పాల్గొన్నట్లు అనుభూతి కలిగేలా ఉంది.
- అలాగే బాబా అమెరికా, ఆస్ట్రేలియా పర్యటించినపుడు తొలిసారి బాబాను దర్శించగా క్రొత్త వారిలో కలిగిన మధురానుభూతుల అద్భుత వర్ణన ఈ సంపుటిలో ఉంది.
- బాబా ఏ సమావేశంలోనైనా, ఏ పర్యటనలోనైనా సరే క్రొత్తవారు, పత్రికా విలేఖరులు, క్రీడాకారులు, చిత్రపరిశ్రమ నటులు, రాజకీయ వేత్తలు ఎవరు ఏ ప్రశ్నలు అడిగినా ఎంతో సహనంతో ప్రేమతో సమాధానమివ్వడం ఈ సంపుటిలో ఎక్కువగా కనబడుతుంది.
- అలాగే చాలామంది తమ ప్రాపంచిక సమస్యలను పరిష్కరించమని అడిగినపుడు, నేను సర్వజ్ఞుడనే అయితే నాకు మీరు మీ సమస్యల గురించి చెప్పవలసిన అవసరం ఉందా అంటూనే మీరు చూసే ప్రపంచమంతా మిధ్య... భగవంతుడొక్కడే సత్యం... నా కొంగును కడవరకూ గట్టిగా పట్టుకోండి... నన్ను అధికాధికంగా ప్రేమించండి... నాకు నూరుశాతం విధేయులుకండి... అని బాబా పదేపదే జనులకు చెబుతూ ఉండడం మనం ఈ సంపుటిలో చూస్తాము.