Avatar Meher Baba's ONLINE BOOK STORE
Cart 0
Meher Prabhu  Charitam -Vol 15 (Telugu) మెహెర్ ప్రభుచరితము by  భావూ కల్చురి (PB)

Meher Book House

Meher Prabhu Charitam -Vol 15 (Telugu) మెహెర్ ప్రభుచరితము by భావూ కల్చురి (PB)

Rs. 200.00

Meher Prabhu Charitam - 15 is Telugu Translation of
English LORD MEHER edition from pages 3977 to 4209

ఈ సంపుటిలో 1959, మార్చి నుండి 1961, డిసెంబర్‌ (ఇంగ్లీషు గ్రంధం 7వ వాల్యూంలోని పేజీ 3977 నుండి 4209 వరకు) దైవీమానవుడైన అవతార్‌ మెహెర్‌బాబా జీవిత వృత్తాంతాన్ని ప్రస్తావించడం జరిగింది. ‘మెహెర్‌ ప్రభుచరితం’ నిజంగా మాటల్లో చెప్పలేని మహిమాన్వితమైన పెన్నిధి. దీని పఠనం బాబా సాన్నిధ్యాన్ని, సాన్నిహిత్యాన్ని చదువరులకు అందజేస్తుంది.
ఈ 15వ భాగంలో అధికశాతం బాబా పూనేలోని గురుప్రసాద్‌లో ఉన్న సమయంలో జరిగిన విషయాలు కళ్ళకు కట్టినట్లు వివరించబడ్డాయి.
బాబా గురుప్రసాద్‌లో ఉండగా ప్రపంచం నలుమూలల నుండి, భారతదేశవాసులు, ప్రేమికులు, కార్యకర్తలు బాబాను దర్శించుకోవడం, వారికి బాబా ఇచ్చిన సందేశాలు ఈ భాగంలో వివరంగా వ్రాయబడ్డాయి.
సో.. కోడూరు కృష్ణారావుకు ‘మెహెర్‌స్థాన్‌’ నిర్మాణానికి అనుమతినివ్వడం, బ్రాబాజాన్‌ వ్రాసిన "Stay with God"గ్రంధ ముద్రణ మరియు ప్రచురణ జరగడం, అహమ్మద్‌నగర్‌లో ఖుస్రూ క్వార్టర్స్‌లో న్యూ మెహెర్‌ సెంటర్‌ను ప్రారంభించి మెహెర్‌ సెంటర్‌ ఎలా నిర్వహించాలో సూచనలివ్వడం, బాబా సర్వజ్ఞతను వెల్లడిచేసే ఉదంతాలు (రోషన్‌ కేరావాలా, వి.ఆర్‌.బడే, అచ్యుతరామరాజు), నిజాయితీ గురించి (పర్విజ్‌కు), విధేయత గురించి (దేశ్‌ముఖ్‌కు) చెప్పడం, సందేహ నివృత్తి (గిరిజా ఖిల్నానీకి) చేయడం, తెలుగువారైన భాస్కరరాజు బృందం బాబా ఎదుట బుర్రకథ చెప్పడం... ఇలా ఎన్నో సంఘటనలు, ఎన్నో మహత్తరమైన సందేశాలతో కూడియున్న ఈ మెహెర్‌ ప్రభుచరితం 15వ భాగం మన సందేహాలను నివృత్తి చేసుకొని, మనస్సును తేలిక పరచుకొని, మెహెర్‌ప్రభుని సదా స్మరిస్తూ, అనందిస్తూ ఆయన ప్రేమ ప్రసాదాన్ని పొందే మహదవకాశాన్ని కలిగిస్తుంది. తెలుగు ప్రేమికులందరూ ఈ అవకాశాన్ని 15వ భాగాన్ని పఠించడం ద్వారా పొందగలుగుతారు!


Share this Product


More from this collection